FSL (FORENSIC SCIENCE LAB), ఎలాంటి నేరాలనైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ తో నిరూపించే టెక్నాలజీ. డిఎన్ఏ టెస్టులు , ఫోర్జరీ సంతకాలు , మర్డర్ కేసు లో ఉపయోగించే ఆయుధాలు , ఆడియో , వీడియో లో నిజాన్ని నిరూపించేదే FSL (FORENSIC SCIENCE LAB).
అత్యాధునిక సైన్స్ పరికరాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మన FSL (FORENSIC SCIENCE LAB). హత్యలు , దొంగతనాలు , భారీ రాబరీలు ఇలా ఎంతటి క్లిష్టమైన కేసుల్ని ఛేదించటానికి FSL (FORENSIC SCIENCE LAB) చాల అవసరం. ఇది నేరాల నిర్ధారణలో దొరికిన పదార్థాలను సేకరించి , క్షున్నంగా పరిశీలించి నిజాలను బయట పెట్టె సైన్స్ ల్యాబ్ .
నేరం ఎలాంటిదైనా సరే , సీన్ అఫ్ అఫెన్స్ నుండి ఆధారాలను సేకరించి ల్యాబ్ టెస్ట్ కు పంపిస్తారు.హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లో ఉన్న సైన్స్ ల్యాబ్ లో అత్యాధునిక ఫోరెన్సిక్ పరికరాలు ఉన్నాయ్. ఈ పరికరాలతో మర్డర్ లు , లైంగిక దాడులు , బాంబు బ్లాస్ట్ లో తీవ్రమైన నేరాల్లో నిందితుల ప్రణయాన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కోర్ట్ లో నిలబెడతారు పోలీస్లు.
దీంతో పాటు మానవ సంబంధాల్ల కేసుల్లో , రక్త నమూనాలని సేకరించి DNA టెస్ట్లతో నిజ నిజాల్ని వెలిగితీస్తాయి దర్యాప్తు సంస్థలు.ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో DNA , AUDIO, VIDEO , బులెట్ ఎనాలిసిస్ డివిజన్లతో పాటు మొత్తమ్ పన్నెండు విభాగాలు ఉన్నాయ్. ఇందులో బులెట్ ఎనాలిసిస్ ల్యాబ్ , ఆడియో వీడియో ల్యాబ్, DNA ల్యాబ్ ప్రధానమైనవి.
DNA ANALYSER :-
ఇందులో DNA కోసం ఉపయోగించే జెనెటిక్ అనలైజర్ , రియల్ టైం PCR అనే పరికరాలని వాడి మానవ సంభందాలను తేలుస్తారు ఇక్కడి ఫోరెన్సిక్ నిపుణులు. ఏ ఫైర్ ఆర్మ్ అయినా సరే , అది AK 47 , కానీ 303 కానీ , ఇంసార్స్ ఫైర్ అర్మ్స్ కానీ, లేదా హ్యాండ్ గన్స్ , పిస్టల్స్ , రివాల్వర్లు ఆలా స్మాల్ అర్మ్స్ సంబందించిన క్యాలిబార్ ఇలా అన్నింటిని ఇక్కడ పరీక్షించవచ్చు .
సుస్పెక్టెడ్ అర్మ్స్ ని ఎప్పుడైతే సీజ్ చేసి FSL (FORENSIC SCIENCE LAB) కి పంపిస్తారో , వాటిని ఇక్కడ టెస్ట్ చేస్తారు. టెస్ట్ రూమ్ సెపరేట్ గ ఒకటి ఉంటుంది. ఆ పని అయిపోయాక , బయటకి వొచ్చిన క్యాట్రీడ్జి కేసు , బుల్లెట్స్ ని , క్రైమ్ హాల్ లో దొరికిన క్యాట్రీడ్జి కేసు ని బుల్లెట్స్ ని కంపేర్ చేస్తారు .
AUDIO / VIDEO ANALYSING SOFTWARE :-
దీంతో పాటు ఆడియో వీడియో ఎనాలిసిస్ టూల్ వాడి నిజ నిజాల్ని బయట పెట్టేది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ .
ఈ సాఫ్ట్వేర్ తో స్పెసిమన్ వాయిస్ ని, క్యూస్షన్ వాయిస్ ని రెండింటిని తీసుకొని వాటిని ఒక్కొక్క స్పెక్ట్రమ్ ని విస్తృతంగా గ ఎనాలిసిస్ చేస్తారు .
ఇందులో ఉన్న రెండు స్పెక్ట్రమ్ వాయిస్ లను తీసుకొని
ఒకటి
WAY ఫామ్ ,
SPECTRAL ఫామ్ ,
NSG ఫామ్ , ఇన్ని రకాలుగా ఎనాలిసిస్ చేసిన తర్వాత వాయిస్ కంపేర్ అవుతున్నాయా లేదా అనేది చివరకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది .
BOMB ANALYSER :-
బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత ఆ ప్రదేశంలో పోలీసులకు దొరికిన బాంబు మెటీరియల్ ను FSL (FORENSIC SCIENCE LAB) కు పంపిస్తారు. వాటిని పరీక్షించేందుకు మొదటిగా కెమికల్ మెథడ్ , దీంట్లో మల్లి కలర్ డిటెక్షన్ ఇందులో ఏవి పెద్ద ఎక్సప్లోజివ్ ఏవి చిన్న ఎక్సప్లోజివ్ అని తెలుస్తుంది.
RELATED POSTS:-
ALSO READ :- AP ప్రభుత్వ ఖాతాల నుండి 2020-21 లో 48,000 కోట్లు | 2021-22 లో 30,000 కోట్లు తప్పిపోయాయి |
ALSO READ :- PAKISTAN - ISI గూఢచారితో ప్రేమలో పడ్డ భారతీయ యువకుడు | సమాచారాన్ని లీక్ చేయమని బలవంతం | ఫేస్బుక్ లో ఫోటో చేంజ్
2 Comments
Nice information
ReplyDeleteNice information.. Keep it up
ReplyDeletePlease do not enter any spam links...